భారత్ న్యూస్ రాజమండ్రి….డ్రోన్ యుద్ధాలకు భారత్ సన్నద్ధం….
ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల ప్రమేయం పెరిగిన నేపథ్యంలో భారత సైనిక దళాలు దీనిపై దృష్టిపెట్టాయి.
ఈ అంశానికి సంబంధించి తమ సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు అక్టోబరు 6 నుంచి 10 వరకూ భారీ విన్యాసాలను నిర్వహించనున్నాయి.
సమీకృత రక్షణ విభాగం (ఐడీఎస్) ఆధ్వర్యంలో జరిగే ఈ యుద్ధక్రీడల్లో భారత అమ్ములపొదిలో ఉన్న డ్రోన్లు, శత్రు డ్రోన్లను నేలకూల్చే వ్యవస్థలను పరీక్షించనున్నారు….
