భారత్ న్యూస్ విజయవాడ…అసెంబ్లీలో డ్రెస్ కోడ్
AP: అసెంబ్లీ, శాసన మండలిలో కూటమి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు. నవరాత్రులు సందర్భంగా రోజుకో కలర్ డ్రెస్లో అసెంబ్లీకి రావాలని మహిళా సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. నేడు గాయత్రి దేవి అలంకారం సందర్భంగా రెడ్ కలర్ డ్రెస్ కోడ్లో సభకు వచ్చారు. మన సంస్కృతి సంప్రదాయాలు గురించి మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో డ్రెస్ కోడ్ పాటిస్తున్నట్టు హోంమంత్రి అనిత తెలిపారు.
