అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివి మార్కెట్ కమిటీ

భారత్ న్యూస్ రాజమండ్రి …అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ శ్రీ కొల్లూరి వెంకటేశ్వరరావు గారిని కొటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ప్రతినిధులు పెద్ది సాగర్, మారడాని రాకేష్, మల్లి బోయాజ్, చెన్ను గురుమూర్తి, ఎల్.ఎస్.ఆర్. వర్మ, మట్టా బాపూజీ పాల్గొన్నారు. వీరు నూతన ఛైర్మన్‌కి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా, ప్రతినిధులు శ్రీ కొల్లూరి వెంకటేశ్వరరావు గారికి దివి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు. వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ, మార్కెట్ కమిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రతినిధులు చూపించిన అభిమానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు