భారత్ న్యూస్ అనంతపురం,,అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వ్యాపించిన శేషాచలం అడవుల్లో భక్తులు కాలినడకన వెళ్లొద్దని జిల్లా అటవీశాఖ అధికారి జగన్నాథ్ సింగ్, ఎస్పీ ధీరజ్ హెచ్చరించారు. అడవుల్లో చిరుతలు, క్రూర మృగాలు, అడవి ఏనుగులు విస్తృతంగా సంచరిస్తున్నాయని, భక్తులు ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పారు. గతంలో కాలిబాటన అడవుల్లోకి వెళ్లిన ముగ్గురు భక్తులు మృగాల దాడిలో మృతిచెందిన ఘటనలను గుర్తుచేస్తూ, భక్తులు తప్పనిసరిగా అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు
