భారత్ న్యూస్ గుంటూరు…డిప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజు లంచం స్వీకరిస్తూ ఏసీబీ చేతిలో red handed ga పట్టుబాటు
గుంటుపల్లి గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడు శ్రీ దామ వేణుగోపాల్ గారి నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు, ధోన్ తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ శ్రీ సునీల్ రాజు గారు, జగదుర్తి గ్రామంలోని Sy nos. 20-1, 20-B2 and 27-B2 సర్వే నంబర్‌కు చెందిన “డాటెడ్ ల్యాండ్” ను “పట్టా భూమి”గా మార్చడానికి రూ. 35,000/- లంచం డిమాండ్ చేసి నాడని, ఏసీబీ అధికారులు ముందస్తు సమాచారం మేరకు ధోన్ తహసీల్దార్ కార్యాలయంపై దాడి నిర్వహించి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీ సునీల్ రాజు గారు లంచం స్వీకరిస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా ACB వారు పట్టుకున్నారు.
స్వీకరించిన మొత్తం రూ.35,000/- లంచం డబ్బులు సాక్ష్యాలతో స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ శ్రీ సోమన్న గారు మరియు సీఐ శ్రీ కృష్ణయ్య గారు, శ్రీనివాసులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
కేసు నమోదు చేసి, తదుపరి విచారణ ఏసీబీ అధికారులు కొనసాగిస్తున్నారు.