ఉప ప్రధాని,బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి.

భారత్ న్యూస్ అనంతపురం .. …ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని,బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా బాబు జగజీవన్ రామ్ గారి చిత్రపటానికి నాయకులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

AMC.. చైర్మన్, కొల్లూరి వెంకటేశ్వరరావు
మాట్లాడుతూ
బడుగు బలహీన వర్గాలకు చెందిన జగజ్జివన్ రామ్ గారు స్వయంకృషితో పేదరికాన్ని అధికమించి, రాజకీయాల్లో ప్రవేశించి, కేంద్రమంత్రి వర్గంలో వివిధ శాఖలను సమర్ధవంతంగా నిర్వహించారన్నారు. దేశానికి ఎనలేని సేవలందించారని, ఆయన నిర్వహించిన ప్రత్యేక శాఖలు రాజ్యాంగబద్ధంగా దళిత వర్గాలకు కల్పించిన రిజర్వేషన్ సౌకర్యాలని అమలుపరిచి వారి అభివృద్ధికి దోహదపడ్డాయి అన్నారు. కార్మిక శాఖ మంత్రిగా కార్మిక వర్గాలకు ఎనిమిది గంటల పని దినాన్ని అమలుపరిచి వారి హక్కుల పరిరక్షణకు కృషి చేశారన్నారు. 1971లో రక్షణ శాఖ మంత్రిగా ఆయన ఆధ్వర్యంలో పాకిస్తాన్ పై జరిగిన యుద్ధంలో భారతదేశం ఘనవిజయం సాధించింది అన్నారు.బాబు జగజ్జివన్ రామ్ గారు భారతదేశంలో దళితులకు ఆరాధ్య దైవంగా పూజిస్తారని,రాజకీయాల లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని, ప్రధాని అభ్యర్థి వరకు పోటీపడ్డారన్నారు.
బాబు జగజ్జివన్ రామ్ గారు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి సమాజంలో అసమానతలు పోగొట్టడం కోసం అనేక ఉద్యమాలు చేసి, దళితులకు, నిమ్మ జాతి వర్గాల వారికి అండగా నిలిచిన వ్యక్తి అని,ఎ పదవి ఇచ్చిన ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా ప్రజల మన్ననలు పొందుతూ, దేశంలో అత్యున్నతమైన ఉన్నత పదవి రైల్వే శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, పనిచేసి, హరిత విప్లవం,అనేక సంస్కరణలు చేసి, కార్మికులకు అండగా నిలిచిన మహనీయుడని కొనియాడారు. ఈనాటి పాలకులు జగజీవన్ రాం గారిని ఆదర్శంగా తీసుకోవడం ద్వారా దళిత, బలహీన వర్గాల సంక్షేమం కోసం అవినీతి రహిత సమాజానికి కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కర్ర సుధాకర్, బండే రాఘవ, పర్చూరు దుర్గాప్రసాద్, మాసవరపు ఆదినారాయణ, ఘంటసాల రాజమోహన్రావు, మండలి రామ్మోహన్రావు, షేక్ బాబావాలి, చెన్ను గాంధీ, కొండవీటి గోవిందు, కంచర్ల ఆనంద్, నాగిడి రాంబాబు, కైతేపల్లి రాజేశ్వరరావు, తాడిoకి పోతురాజు, గ్యాలం శ్రీను,మైలాహరిబాబు, మొగల్ మొరాడ్ బేగ్, మునిపల్లి రవి, కొల్లూరి రాజశేఖర్, గుంటూరు నాగరాజు, జటావత్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు..