భారత్ న్యూస్ మంగళగిరి…మొంథా తుపాను ప్రభావం పై సచివాలయం నుంచి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు
అమరావతి :

Ammiraju Udaya Shankar.sharma News Editor…సమీక్షకు పాల్గొన్న మంత్రులు లోకేష్, అనిత, సీఎస్, ఇతర ఉన్నతాధికారులు…
మొంథా తుఫాన్‌పై ఆర్టీజీఎస్ లో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
ప్రస్తుతం కాకినాడకు 680 కి.మీ దూరంలో ఉన్న మొంథా తుఫాన్
16 కి.మీ వేగంతో తీరాన్ని సమీపిస్తున్న తుఫాన్.
ఈరోజు, రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచన
గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు
రేపు రాత్రికి తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు
ప్రతీ గంటకు తుఫాన్ కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలన్న సీఎం చంద్రబాబు
మొంథా తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్‌కు సీఎం సూచన
వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం

కాలువ గట్లు పటిష్టం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని అధికారులకు చెప్పిన సీఎం