భారత్ న్యూస్ నెల్లూరు….మెంత తుఫాన్ నేపథ్యంలో నిరంతరం 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమును చల్లపల్లి తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అత్యవసర బృందాలను కూడా సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు. కానీ బుధవారం ఉదయం వెళ్లి పరిశీలించగా తహసిల్దార్ కార్యాలయానికి తాళాలు వేసి ఉన్నాయి. ఒకవేళ బందరు రోడ్ లో పెట్రోల్ బంకు పక్కన నూతనంగా కట్టిన సచివాలయం వద్ద ఉన్నారా అంటే అక్కడ కూడా తాళాలు వేసి ఉన్నాయి. మరి 24 గంటలు పని చేసే కంట్రోల్ రూమును ఎక్కడ ఏర్పాటు చేశారో… ఆ కంట్రోల్ రూమ్ లో నియమించిన సిబ్బంది ఎక్కడున్నారో… ఆ దేవుడికే తెలియాలని తాళాలు వేసి ఉన కార్యాలయాలను చూసి ప్రజలు గుసగుస లాడుకుంటున్నరు.
