దేశంలో మొదటి అండర్‌వాటర్‌ రోడ్ కం రైల్ టన్నెల్.. అసోంలో నిర్మించనున్న కేంద్రం

భారత్ న్యూస్ విశాఖపట్నం..…..దేశంలో మొదటి అండర్‌వాటర్‌ రోడ్ కం రైల్ టన్నెల్.. అసోంలో నిర్మించనున్న కేంద్రం

అసోంలో చేపట్టనున్న అండర్ వాటర్ ట్విన్ ట్యూబ్ రోడ్ కం రైల్ టన్నెల్ ప్రాజెక్ట్‌కు రూ.18,662 కోట్లు (2.5 బిలియన్ డాలర్లు) ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) అంగీకరించింది.

త్వరలో అసోం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మపుత్ర నదిపై గోపూర్-నుమాలిఘడ్ మధ్య ఈ ప్రాజెక్టు చేపడుతారు.