విద్యుత్ తీగ లాగుతుంటే కదులుతున్న అధికారుల అవినీతి డొంక

భారత్ న్యూస్ గుంటూరు….Ammiraju Udaya Shankar.sharma News Editor…విద్యుత్ తీగ లాగుతుంటే కదులుతున్న అధికారుల అవినీతి డొంక

తేదీ: 13 జూన్ 2025

పేద దళిత ల ఉచిత విద్యుత్
“జగజ్జీవన్ జ్యోతి పథకం” దుర్వినియోగం పై సమాచార హక్కు చట్టం కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ పిర్యాదు పై విజిలెన్స్ విచారణ

రాష్ట్రం మొత్తంలో
విద్యుత్ శాఖలో వివిధ ప్రాంతాల్లో డివిజన్ , మండలాల పరిధిలో అధికారులు అవినీతికి పాల్పడుతూ అనర్హులకు లబ్ధి చేకూరుస్తున్నారని ప్రధానంగా ఆరోపిస్తున్న శ్రీనివాస్ గౌడ్

రాష్ట్ర విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి జి. విజయానంద్ కు
ఫిర్యాదు చేసిన శ్రీనివాస్ గౌడ్

ఇదే అంశం పై రాష్ట్ర లోకాయుక్త కు సైతం ఫిర్యాదు

జగజ్జీవన్ జ్యోతి పథకం లో అవినీతి పై రాష్ట్ర ఛీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ జాయింట్ డైరెక్టర్ హోదాలోని ఐపీఎస్ అధికారితో విచారణకు ఆదేశించిన ఆదేశించిన ప్రభుత్యం.

బడుగువర్గాల అభ్యున్నతికి ఉద్దేశించిన జగజ్జీవన్ జ్యోతి పథకం దుర్వినియోగం జరిగిన ఘటనపై విజిలెన్స్ శాఖ దృష్టి సారించింది. ఈ వ్యవహారాన్ని ద్వారా వెలుగులోకి తెచ్చిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదుతో అధికారులు రంగంలోకి దిగారు.

శుక్రవారం తోట్లవల్లూరు మండలంలోని దేవరపల్లి లో
ఆంధ్రప్రదేశ్ ట్రెఫ్ట్ స్క్వాడ్ ఎలక్ట్రీకల్ విజిలెన్స్ విజయవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్
జి.గంగా భవాని నేతృత్వంలో ఏపీ.టీ.ఎస్. అధికారుల విచారణ నిర్వహించారు.
గ్రామంలో అక్రమంగా ఈ పథకానికి చెందిన విద్యుత్ సర్వీసు దుర్వినియోగం జరుగుతున్నట్టు గుర్తించిన విజిలెన్స్ అధికారులు ఆ విద్యుత్ కనెక్షన్ ను తొలగించారు. ఈ విషయంలో
అధికారుల పాత్ర అవినీతి అంశంపై విజిలెన్స్ అధికారులు
విచారణ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎలక్ట్రీకల్ విజిలెన్స్ అధికారి ఆర్.దాస్ ఫిర్యాదుదారుడైన జంపాన శ్రీనివాస్ గౌడ్ ను కలిసి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకున్నారు.

ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్
మాట్లాడుతూ దళితులలో పేదలకు 200 యూనిట్ ల వరకు ఉచితంగా విద్యుత్ వినియోగించుకునేలా సాంఘీక
సంక్షేమ శాఖ , విద్యుత్ శాఖ
ల ద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది తెలిపారు.
కానీ కొందరు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు అవినీతికి పాల్పడుతూ అనర్హులకు దళితుల ఉచిత విద్యుత్ ను ఇతర వర్గాలకు లబ్ధిచేకూర్చుతూ పెద్ద ఎత్తిన అవినీతిని తెరలేపుతున్నారని
ఆరోపించారు.పేదల సంక్షేమ
పథకాలపై ఎలాంటి పర్యవేక్షణ లేకుండా వదిలేసినట్లయితే, అసలైన లబ్ధిదారులు ఇలాగే నష్టపోవాల్సి వస్తుందని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిస్తున్నారు
దళితులకు ఉచిత విద్యుత్ ఇవ్వాల్సి ఉండగా, దేవరపల్లి గ్రామంలో బహిరంగంగా వేరొకరికి కేటాయించిన అధికారులు అవినీతికి అడ్డుపడుతోందని తెలిపారు.ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే, ఇటువంటి అనేక దుర్వినియోగాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని శ్రీనివాస్ గౌడ్ ఆరోపిస్తున్నారు.
లోకాయుక్త మరియు రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో
మొదలైన విజిలెన్స్ విచారణతో అన్ని జిల్లాలలో జోరుగా జరుగుతున్న జగజ్జీవన్ జ్యోతి పథకం దుర్వినియోగం అధికారుల అక్రమార్జన బయటకు వస్తుంది
అన్నారు. పథకాలు ప్రజలకు నిజంగా ఉపయోగపడాలంటే, అవి కేవలం ప్రచార సాధనంగా కాకుండా, పారదర్శక వ్యవస్థతో అమలు చేయాలని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు.