భారత్ న్యూస్ విశాఖపట్నం..వంటగ్యాస్ కూ పోర్టబిలిటీ!
వంటగ్యాస్ సిలిండర్(LPG) సరఫరా చేస్తున్న కంపెనీ/ఏజెన్సీ సేవలపై అసంతృప్తిగా ఉన్నారా.. అయితే వీటిని మార్చుకునే వీలు త్వరలో కలగనుంది.ఈ నేపథ్యంలోనే ఇంధన నియంత్రణ సంస్థ PNGRB (పెట్రోలియం అండ్ నాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్) ప్రజలు, పంపిణీదార్లు, సామాజిక సంస్థల నుంచి సూచనలు, సలహాలు ఆహ్వానిస్తోంది. గ్యాస్ సిలిండర్ ధర ఏ కంపెనీది అయినా ఒకటే కనుక, తమకు అనువైన డీలర్/ కంపెనీని ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారులకు కల్పించాలన్నదే ఉద్దేశం.
