భారత్ న్యూస్ అనంతపురం..న్యాయ పాఠంపై వివాదం.. ఎన్సీఈఆర్టీ క్షమాపణలు*
📚పాఠ్యపుస్తకాల్లో న్యాయ వ్యవస్థపై వివాదాస్పద పాఠం వివాదం నేపథ్యంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) వెనక్కి తగ్గింది. మంగళవారం బహిరంగ క్షమాణలు చెప్పింది. ఎన్సీఈఆర్టీ డైరెక్టర్, సభ్యులంతా బేషరతుగా క్షమాపణలు కోరారు.

📚అంతేకాకుండా వివాదాస్పద పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా ఉపసంహరిస్తున్నట్లు ఎన్సీఈఆర్టీ వెల్లడించింది. ఎన్సీఈఆర్టీ ఇటీవల ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ పేరుతో 8వ తరగతి సాంఘిక శాస్త్రం పార్ట్ -2 పాఠ్యపుస్తకాన్ని ప్రచురించింది. దీంట్లో న్యాయ వ్యవస్థలో కొంత అవినీతి ఉందని, భారీ సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొంది