భారత్ న్యూస్ రాజమండ్రి Ammiraju Udaya Shankar.sharma News Editor…….ఏపీలో కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.352.48 కోట్లు మంజూరు చేసింది.
👉 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద ఈ నిధులు కేటాయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
👉 కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మాణంలో ఉన్న పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల వైద్య కళాశాలలకు, వాటికి అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు ఈ నిధులు వెచ్చిస్తారు.
