శ్రీకాకుళం జడ్పీ హైస్కూల్లోని పునరావాస కేంద్రం పరిశీలించిన నియోజకవర్గ ప్రత్యేక అధికారి పి.సాయిబాబు

భారత్ న్యూస్ రాజమండ్రి.శ్రీకాకుళం జడ్పీ హైస్కూల్లోని పునరావాస కేంద్రం పరిశీలించిన నియోజకవర్గ ప్రత్యేక అధికారి పి.సాయిబాబు

శ్రీకాకుళం – ఘంటసాల :-

మొంతా తుఫాన్ కారణంగా నియోజకవర్గ ఘంటసాల మండలం శ్రీకాకుళం జడ్పీ హైస్కూల్లో గ్రామంలోని పూరిళ్లు, కాల్వగట్లు, చెరువుకట్ల పై నివసిస్తున్న 25 ఎస్టీ కుటుంబాలకు చెందిన 70 మందిని ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రానికి తీసుకొచ్చారని చెప్పారు.

తహసీల్దార్ బి.విజయప్రసాద్, ఎంపీడీఓ డి.సుబ్బారావు, వీఆర్వో, కార్యదర్శి, అధికారులు పునరావాస కేంద్రంలో డ్రింకింగ్, రన్నింగ్ వాటర్, మరుగుదొడ్లు, పారిశుధ్యం ఏర్పాట్లు బాగున్నాయాన్నారు.

పునరావాస కేంద్రంలోని ప్రజలకు రుచికరమైన అల్పాహారం, రెండు పూటల భోజనం నాణ్యతతో అందిస్తున్నట్లు చెప్పారని తెలిపారు.

ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఆయా సదుపాయాలను సర్పంచ్ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు..

శ్రీకాకుళం జడ్పీ హైస్కూల్లోని పునరావాస కేంద్రం ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు నియోజకవర్గ ప్రత్యేకాధికారి సాయిబాబు వారిని అభినందించారు.

ముందుగా పునరావాస కేంద్రంలోని ప్రజలతో ఏర్పాట్లు, సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. తుఫాను తీవ్రత తగ్గేంత వరకు పునరావాస కేంద్రంలో ఉండాలని సూచించారు.

అనంతరం పునరావాస కేంద్రంలో వీఆర్వో గోపి పర్యవేక్షణలో భోజనాలు ఏర్పాటు చేయగా జనసేన నేత కొండవీటి శ్రీనివాసరావు వడ్డీంచారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముప్పనేని రవి ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో కె.వెంకటేశ్వరరావు, డాక్టర్ సాయి శరణ్య, పంచాయతీ కార్యదర్శి జి.శ్రీనివాసరావు, వీఆర్వో దగాని గోపి, సూపర్ వైజర్ రవి కుమార్, హెచ్ వి రత్నకుమారి, ఏఎన్ఎం ధరణి, వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీ, సచివాలయ, రెవిన్యూ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.