కానిస్టేబుల్ ఫలితాల్లో జరుగువాని పాలెం యువకుడికి జిల్లా స్థాయిలో మూడవ ర్యాంకు

భారత్ న్యూస్ శ్రీకాకుళం…..కానిస్టేబుల్ ఫలితాల్లో జరుగువాని పాలెం యువకుడికి జిల్లా స్థాయిలో మూడవ ర్యాంకు

మూడో ర్యాంకు సాధించిన జరుగు ఆంజనేయులు

ఈరోజు విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో కోడూరు మండల పరిధిలోని జరుగువారిపాలెం గ్రామానికి చెందిన జరుగు ఆంజనేయులు అనే యువకుడు జిల్లాలో తృతీయ ర్యాంకును సాధించాడు.

అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాలోని మూడో ర్యాంక్ సాధించిన ఆంజనేయులుకు పలువురు అభినందనలు తెలియజేశారు.