భారత్ న్యూస్ మంగళగిరి…ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడును అభినందించేందుకు కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం చెన్నూరు నుంచి పాలకొల్లుకు ఇటీవల ఆటోలో వచ్చిన దివ్యాంగుడు మెర్ల వెంకటేశ్వరరావుకు ట్రై స్కూటీని ఇస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్ లో వెంకటేశ్వరరావును కలిసి హామీ ఇచ్చిన విధంగా ట్రై స్కూటినీ స్వయంగా మంత్రి లోకేష్ అందజేశారు.
