భారత్ న్యూస్ గుంటూరు…క్లిష్టమైన ప్రోగ్రామ్స్‌నూ రాస్తున్న కొత్త ఏఐ టూల్.సాఫ్ట్వేర్ రంగంలో అలజడి
💻ఆంథ్రోపిక్ నుంచి క్లాడ్ ఓపస్ 4.6 మోడల్ పేరిట ఓ కొత్త టూల్ విడుదలైంది. సీ-ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో క్లిష్టంగా పరిగణించే సీ-కంపైలర్ ప్రోగ్రామ్‌ను ఇది ఎంతో సులువుగా రాసిందని పరిశోధకులు తెలిపారు. ఐటీలో పనిచేసే ప్రతి ముగ్గురిలో ఒక్కరు మాత్రమే ఈ కోడ్‌ను స్పష్టంగా రాయగలరని నిపుణులు పేర్కొనడం గమనార్హం.

🖨️ ఆంథ్రోపిక్ టూల్స్ వల్ల ఔట్సోర్సింగ్ ప్రాజెక్టులు తగ్గే ప్రమాదం ఉన్నదన్న భయాలు పెరుగుతున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల నుంచి మన ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టుల బిల్లింగ్‌లు ‘లేబర్ బేస్డ్ మోడల్’పై ఆధారపడి ఉంటాయి. అంటే, ఒక ప్రాజెక్టు కోసం ఎంతమంది టెకీలు, ఎన్ని గంటలు పనిచేశారన్న లెక్కనే క్లయింట్లు డబ్బులు చెల్లిస్తారు. దీన్నే ‘బిల్లబుల్ అవర్స్’గా వ్యవహరిస్తారు. అయితే, 10 మంది చేసే పనిని క్లాడ్ కోవర్క్ సాయంతో నిమిషాల్లో పూర్తిచేయవచ్చు. దీంతో నైపుణ్యం అంతగా అవసరం లేని ఐటీ ఉద్యోగాలు ప్రమాదంలో పడే ప్రమాదమున్నదని నిపుణులు చెప్తున్నారు. ఆంథ్రోపిక్ నుంచి క్లాడ్-కోవర్క్ టూల్ విడుదల కాగానే ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీల షేర్లు పడిపోవడానికి కూడా కారణం ఇదే.