వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ సమావేశం జరిగింది.

భారత్ న్యూస్ విశాఖపట్నం..తాడేపల్లి

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ సమావేశం జరిగింది. వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్‌ శెట్టిపల్లి రఘురామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ క్రమశిక్షణకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువెళ్ళనున్నారు. ఈ సమావేశంలో క్రమశిక్షణా కమిటీ సభ్యులు తానేటి వనిత, రెడ్డి శాంతి, కైలే అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.