ఏపీలో ఈ నెల 11,12 తేదీలలో కలెక్టర్ల కాన్ఫరెన్స్

అమరావతి :

..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో ఈ నెల 11,12 తేదీలలో కలెక్టర్ల కాన్ఫరెన్స్

అమరావతి :

Ammiraju Udaya Shankar.sharma News Editor…సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 11వ తేదీ నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు అందరు జిల్లా కలెక్టర్లకు మెమోను గురువారం జారీ చేశారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించనున్న ఈ కాన్ఫరెన్సు అవసరమైన సమాచారంతో జిల్లా కలెక్టర్లు హాజరు కావాలని కోరారు. ఈ రెండు రోజులు కలెక్టర్ల స్థానంలో జాయింట్ కలెక్టర్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఎజెండా అంశాలను ప్రత్యేకంగా తెలియజేస్తామని పేర్కొన్నారు….