భారత్ న్యూస్ నెల్లూరు….మచిలీపట్నం అక్టోబర్ 25: ———-

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఈ నెల 27,28,29 తేదీలలో జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు దినాలుగా ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు.
మోంత తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఇతర విద్యాసంస్థలు అన్నింటికి 3 రోజులపాటు సెలవు దినాలుగా ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు
జిల్లాలోని సాంఘిక సంక్షేమ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులందరూ ఈనెల 26 వ తేదీ ఆదివారం సాయంత్రంలోగా వారి వారి ఇండ్లకు వెళ్లే విధంగా పర్యవేక్షించాలన్నారు.
ఈ విషయమై క్షేత్రస్థాయిలో సజావుగా అమలయ్యే విధంగా జిల్లా విద్యాధికారి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణాజిల్లా మచిలీపట్నం వారిచే జారీ చేయబడినది