సచివాలయం సిబ్బంది పై కలెక్టర్ కు పిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఇంటూరి..

భారత్ న్యూస్ గుంటూరు…సచివాలయం సిబ్బంది పై కలెక్టర్ కు పిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఇంటూరి..

గుడ్లూరు మండలం మోచర్ల సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే..

సచివాలయంలో 11 మంది సిబ్బందికి డ్యూటీలో ఒక్కరు ఉండటంతో ఆగ్రహం..

కందుకూరు నియోజకవర్గం లోని గుడ్లూరు మండలం మోచర్ల గ్రామసచివాలయంలో 11 మంది సిబ్బంది పనిచేస్తుండగా… శుక్రవారం ఒక్కరు మాత్రమే డ్యూటీలో ఉన్నారు. మిగతా పదిమంది ఉదయాన్నే రిజిస్టర్ లో సంతకాలు చేసి వెళ్లిపోయారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు… శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీకి వెళ్ళినారు .

సచివాలయ ఉద్యోగులు విధులకు సక్రమంగా రావడం లేదని, తెట్టు గ్రామస్తులు శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన… సచివాలయానికి ఆకస్మికంగా వెళ్లారు. ఆ సమయంలో డిజిటల్ అసిస్టెంట్ ఒక్కరే ఉన్నారు.

మిగతా పదిమందిలో ముగ్గురు మాత్రం, గుడ్లూరు ఎంపీడీవో కార్యాలయంలో సమావేశానికి హాజరైనట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే నాగేశ్వరరావు, మిగిలిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ… వారికి మెమోలు ఇవ్వాలని ఎంపీడీవోను ఆదేశించారు.