అరుదైన రికార్డ్ ‌సృష్టించిన సీఎం యోగి ఆదిత్యనాథ్

భారత్ న్యూస్ రాజమండ్రి…అరుదైన రికార్డ్ ‌సృష్టించిన సీఎం యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అరుదైన రికార్డు సృష్టించారు. ఆయన 8 ఏళ్ల 132 రోజులు సీఎంగా కొనసాగుతూ, గోవింద్ వల్లభ్ పంత్ (8 ఏళ్లు 127 రోజులు) రికార్డును అధిగమించారు. ఈ మైలురాయితో యూపీకి అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డును కలిగి ఉన్నారు. మార్చి 19, 2017న మొదట సీఎంగా ప్రమాణ స్వీకరించిన యోగి, వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చారు..