భారత్ న్యూస్ రాజమండ్రి ….ఏపీ సీఎం సూచన మేరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనిత.
📍అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదు. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101లో సంప్రదించాలి.
కాల్వలు, వాగులు, కల్వర్టుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ సిద్ధంగా ఉండాలి : హోంమంత్రి వంగలపూడి అనిత
