భారత్ న్యూస్ రాజమండ్రి ….మేఘాల విస్ఫోటనం లేదా క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి ?
పది కిలోమీటర్ల రేడియస్ ప్రాంతంలో ఒక గంటలో 10 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని మేఘాల విస్ఫోటనం లేదా క్లౌడ్ బరస్ట్ అంటారు.
ఈ పదం న్యూస్ లో ఎందుకుంది ?
ఉత్తర కాశీలో క్లౌడ్ బరస్ట్ (మేఘాల విస్ఫోటనం) కారణంగా వరదలు రావడంతో నలుగురు మృతి,50 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం.
ఎందుకు వస్తాయి ?
వాతావరణ మార్పుల కారణంగా తేమతో నిండిన భారీ మేఘాలు మోహరించడం వలన క్లౌడ్ బరస్ట్ జరుగుతుంది. అందువల్ల వీటిని అంచనా వేయడం కష్టం.
ఎప్పుడు వస్తాయి ?
రుతుపవనాలు వచ్చే ముందు, వచ్చిన తరువాత కూడా క్లౌడ్ బరస్ట్ జరుగుతుంటుంది.మే నుంచి జూలై-ఆగస్ట్ వరకు భారతదేశంలోని ఉత్తర ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి.

అక్కడి మంత్రి ఏమన్నారు ?
“అది వరద కాదు గంగ మీ పాదాలు కడగాదనికి మీ ఇంటికి వచ్చింది” అని ఉత్తరాఖండ్ మత్స్యకార మంత్రి అన్నారు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.