భారత్ న్యూస్ గుంటూరు…గుంటూరు
గుంటూరు: నేటి నుంచి మిర్చి రైతులకు యార్డులో భోజనం

Ammiraju Udaya Shankar.sharma News Editor…మిర్చి యార్డులో అన్నదాతలకు గురువారం నుంచి ఉచిత భోజన పథకం అమల్లోకి రానుంది.
టెండర్ల ఖరారులో జాప్యం వల్ల ఈ ఏడాది పథకం

ఆలస్యమైంది. పాలకవర్గం, అధికారులు టెండరు ఖరారు చేసి గుత్తేదారుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. భోజనం, అల్పాహారం రూ. 88. 25కే పెట్టేలా ఒప్పించారు. ఇందులో ఆల్పాహారానికి రూ. 20, భోజనానికి రూ. 68. 25. గురువారం ఉదయం 11. 30 గంటలకు యార్డు చైర్మన్ కుర్రా అప్పా రావు, కార్యదర్శి చంద్రిక పథకాన్ని ప్రారంభిస్తారు. డైనింగ్ హాలును శుభ్రం చేయించారు. వంట సామగ్రి, ప్రిజ్ను సిద్ధం చేశారు. శుక్రవారం నుంచి అల్పాహారం కూడా పెడతారు….