భారత్ న్యూస్ డిజిటల్ : యానాం: ఈరోజు యానాం మున్సిపాలిటీ ఆఫీస్ లో నూతన కమీషనర్ గా భాద్యతలు తీసుకున్న శ్రీ రాఘవన్ గార్ని మర్యాద పూర్వకంగా కలిసి దుస్సాలువాలతో సత్కరించిన యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్దాని దినేష్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ కాటంశెట్టి వెంకట రామ్మూర్తి గారు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ పొన్నాడ విగ్నేశ్వరుడు గారు, శ్రీ చెక్కల అరుణ్ గారు, శ్రీ పాలంకి మేధానిధి శర్మ గారు, శ్రీ చింతలపూడి నాగ హర్షవర్ధన్ గారు, యానాం వి సి కె పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ మెల్లం చిన్న గారు .
యానాం లో గత సంవత్సరకాలం లో భూమిపూజ చేసి సకాలంలో పనులు పూర్తిచెయ్యాకుండా అలసత్వం వహిస్తున్న మున్సిపాలిటీ ఇంజనీర్ల పనితీరు పై కంప్లైంట్ చెయ్యడం జరిగింది
ఎంపీ శ్రీ వైతిలింగం గారు తన ఎంపీ ఫండ్స్ ద్వారా సావిత్రి నగర్ లో స్మశానవాటిక నిర్మానాణికి ఫండ్స్ రిలీజ్ చేసి సంవత్సరాలు గడుస్తున్నా పనులు కార్యరూపం దాల్చడం లేదని కాబట్టి మీ హయం లోనైనా పెండింగ్ పనులు అన్నీ త్వరితగతిన పూర్తిచేయ్యాలని శ్రీ దినేష్ గారు కోరినవెంటనే ఆయన సానుకూలంగా గా స్పందించారు

విసికే పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ మెల్లం చిన్నా గారు ఆది డ్రావిడ ద్వారా శాంక్షన్ అయిన వర్క్ లను యానాం లోని బహుజనుల ఏరియాల్లో పనులు ప్రారంభించాలని కోరడం జరిగింది దానికి కమీషనర్ శ్రీ రాఘవన్ గారు తాను యానాం లోని మున్సిపాలిటీ పెండింగ్ వర్క్ లపై ప్రత్యేక ద్రుష్టి పెట్టి ఆర్డర్ ప్రకారం పనులు పూర్తిచేస్తానని హామీ ఇచ్చారు