ఏఐ కంటెంట్ పై కేంద్రం కీలక ఆదేశాలు

భారత్ న్యూస్ రాజమండ్రి…ఏఐ కంటెంట్ పై కేంద్రం కీలక ఆదేశాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో రూపొందిన కంటెంట్ కొత్త సవాళ్లు విసురుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఏఐ జనరేటెడ్ కంటెంట్ కు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తప్పనిసరిగా లేబుల్ వేయాలని కేంద్రం ఆదేశించింది.

ఏఐ కంటెంట్ ను అందరూ సులువుగా గుర్తించేలా ఆ లేబుల్ ఉండాలని సూచించింది. ఒకసారి అప్లయ్ చేశాక లేబుల్ను గానీ, మెటా డేటాను గానీ తొలగించడానికి లేదా కనబడకుండా చేయడానికి వీల్లేకుండా ఉండాలంది.

ఏఐ జనరేటెడ్ లేదా డీప్ ఫేక్ కంటెంట్ను తొలగించాలని ప్రభుత్వం లేదా కోర్టులు ఆదేశించినప్పుడు దాన్ని మూడు గంటల్లోనే తొలగించేలా సామాజిక మాధ్యమాలకు కేంద్రం గడువు విధించింది.