సెంట్రల్ జైల్లో సెల్ఫోన్ కలకలం,

భారత్ న్యూస్ అనంతపురం .. …సెంట్రల్ జైల్లో సెల్ఫోన్ కలకలం

AP: కడప సెంట్రల్ జైల్లో ఖైదీలకు సెల్ఫోన్లు

సరఫరా చేయడం కలకలం రేపింది. ఖైదీలకు జైలు సిబ్బందే సెల్ఫోన్ ఇచ్చినట్టు విచారణలో తేలింది. దీంతో ఐదుగురు జైలు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మరికొంత మంది జైలు సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఖైదీలకు సెల్ఫోన్ ఇవ్వడంపై ఉన్నతాధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు..