ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు

భారత్ న్యూస్ అనంతపురం .. …ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు

తిరువూరు టౌన్ : హిందూపురం ఎమ్మెల్యే ఆంధ్రుల అభిమాన నటుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి 65వ జన్మదినోత్సవాన్ని తిరువూరు బోసు బొమ్మ సెంటర్ నందు బాలకృష్ణ గారి అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య కేక్ కటింగ్ చేసి వారి జన్మదినాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరి రామారావు గారు వాసం మునియ్య నాళ్ల సురేంద్ర, బొమ్మసాని ఉమా మహేష్,లింగినేని సుధాకర్,పార్టీ నాయకులు,కార్యకర్తలు ,మరియు తెలుగు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…