భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….నకిలీ కేబుల్ తీగలను విక్రయిస్తున్న దుకాణదారుడిపై కేసు
ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునిల్ తెలిపిన వివరాల ప్రకారం, ‘వీ గార్డు’ కంపెనీకి చెందిన నకిలీ కేబుల్ తీగలను విక్రయిస్తున్న ఒక ఎలక్ట్రికల్ దుకాణదారుడిపై కేసు నమోదు చేశారు.

బుధవారం శివాజీ చౌక్‌లోని దుకాణంలో తనిఖీ చేయగా, రెండు వీ గార్డు తీగల డబ్బాలు నకిలీవని గుర్తించారు.
కంపెనీ రీజినల్ హెడ్ నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.