భారత్ న్యూస్ అనంతపురం .. …కల్పబుల్ హోమీసైడ్ కింద మాజీ సీఎం జగన్ పై కేసు
ఏపీలో సింగయ్య కేసులో గుంటూరు పోలీసులు వైఎస్ జగన్ సహా మిగతా నిందితులపై బీఎన్ఎస్ 105, 49 సెక్షన్ల కింద కేసు నమోదు
చేశారు. బీఎన్ఎస్ 105 సెక్షన్ అంటే.. హత్య కిందకు రాని కల్పబుల్ హోమీసైడ్. ఒక వ్యక్తి చావుకు కారణమైనప్పుడు ఈ సెక్షన్ పెడతారు. నేర నిరూపణ జరిగితే ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు విధించొచ్చు. నేర తీవ్రతను బట్టి 5-10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. దొరికిన ఆధారాల మేరకు 105 సెక్షన్ జత చేశారు.
వైఎస్ జగన్ పై పెట్టిన సెక్షన్లు ఇవే
ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ కారు కింద పడి చనిపోయిన సింగయ్య కేసులో గుంటూరు పోలీసులు కొత్త సెక్షన్లు చేర్చారు. తొలుత BNS 106(1) సెక్షన్ కింద నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమయ్యారనే కేసు పెట్టగా, తాజాగా BNS 105, 49 సెక్షన్లు జోడించారు. హత్య కిందకు రాని నేర విషయాల్లో BNS 105 వాడతారు.
నిరూపణైతే జీవిత ఖైదు/5-10 ఏళ్లు జైలు శిక్ష, ఫైన్ విధించవచ్చు. ఇది నాన్ బెయిలబుల్. నేరానికి ప్రేరేపించారంటూ BNS 49 సెక్షన్ పెట్టారు.
జగన్ వాహనం నడిపింది… ఏఆర్ కానిస్టేబుల్
ఏపీలో రెంటపాళ్ల పర్యటనలో జగన్ వాహనాన్ని నడిపింది రామిరెడ్డి వెంకటరమణారెడ్డి అని తేలింది. ఆ వాహనం కిందపడే సింగయ్య మృతి చెందారు. వెంకట రమణారెడ్డి ఏఆర్ కానిస్టేబుల్. ఏపీఎస్పీ విభాగం నుంచి ప్రకాశం జిల్లాకు ఆర్మ్ రిజర్వ్ విభాగానికి కన్వర్షన్లో వచ్చారు. ఒంగోలులో రిపోర్టు చేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి డిప్యుటేషన్లోనే జగన్ వద్దే కొనసాగుతున్నారు. ఈయన ఏ బ్యాచ్కు చెందిన వారో అనే కనీస సమాచారం కూడా పోలీసుల వద్ద లేదు..
