అమరావతి- రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి- రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

హాజరైన పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, పురపాలక, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, సీఆర్డీఏ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు

రాజధాని నిర్మాణం కోసం మొత్తం రూ. 81,317 కోట్ల మేర పనుల్ని ప్రతిపాదించిన సీఆర్డీఏ

ప్రస్తుతం రూ.50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచిన సీఆర్డీఏ.

రాజధానిలో 74 ప్రాజెక్టుల పనులు ప్రారంభమైనట్టు సీఎంకు వివరించిన అధికారులు

హౌసింగ్, ఇతర భవనాల నిర్మాణాలు, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలు, రోడ్లు,డక్ట్ లు లాంటి ట్రంక్ ఇన్ఫ్రా పనులు, వరద నియంత్రణ పనులు కూడా చేపట్టినట్టు వెల్లడి

రికార్డు టైమ్ లో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు