భారత్ న్యూస్ గుంటూరు….రామకృష్ణాపురంలో పశు వైద్య శాఖ వారు ఏర్పాటు చేసిన శిబిరం
కోడూరు మండలంలోని రామకృష్ణాపురం గ్రామపంచాయతీలో రాష్ట్రీయ గోకుల మిషన్లో భాగంగా పశుసంవర్ధక శాఖ గర్భకోస వ్యాధుల పశువైద్య శిబిరాన్ని నిర్వహించబడినది. ఈ శిబిరంలో చూడికట్టని ,తిరిగిపోర్లు ,ఎదకురానిది, గర్భకోశ వ్యాధులకు చికిత్స అందించడం జరిగినది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణా డెల్టా నీటి పారుదల అధ్యక్షులు శ్రీ దేవన బోయిన వెంకటేశ్వరరావు శిబిరం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి డా!!సాంబశివరావు సహాయసంచాలకులు ప్రాంతీయ పశు వైద్యశాల అవనిగడ్డ వారు మరియు పశు వైద్యులు డాక్టర్ రోహిత్ చంద్ర ,డాక్టర్ సుధారాణి ,డాక్టర్ షఫీ ,డాక్టర్ ప్రియాంక మరియు ప్యారాష్టాప్ ఆఫ్ వి ఎల్ ఓ ,ఎల్ఎస్ఎ ,విఎ ,లాబ్ టెక్నీషియన్ 1962 సంచార వైద్య సిబ్బంది మరియు తదితరులు పాల్గొని సేవలు అందించడం జరిగినది మొత్తం 185 పశువులకు వివిధ రకాల సేవలు మరియు గొర్రెలకు 1500 నట్టలనివారణ చేయటం జరిగినది. ఇందులకు రైతు సోదరులు హర్షం వ్యక్తం చేసి నారు.
