అమరావతి: మొత్తం 1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి: మొత్తం 1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం కేబినెట్‌ సమావేశం జరిగింది.

కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు.

విజయనగరంలో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

ఓర్వకల్లులో రిలయన్స్‌ కన్జ్యూమర్‌ ప్రాజెక్టు, పర్యాటక ప్రాంతాల్లో స్టార్‌ హోటళ్ల నిర్మాణ ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదించింది.