భారత్ న్యూస్ మంగళగిరి…మత్స్యకారులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం : కనపర్తి
అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం,సొర్లగొంది గ్రామంలో మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన మత్స్యకారులకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత బియ్యం మరియు నిత్యావసరాలు అందజేసి,ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా ఉంటుందని ధైర్యం చెప్పిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు.ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, నాగాయలంక మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు,పార్టీ నేతలు కొల్లాటి ధనుంజయ్,కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు, నాయుడు రామయ్య, పర్చూరి దుర్గాప్రసాద్,బండే రాఘవ, మేడికొండ విజయ్,మంచాల మహేంద్ర తదితరులు పాల్గొన్నారు
