భారత్ న్యూస్ గుంటూరు…..నిరుపేద ఆకురాతి సాంబయ్యకు నివాస గృహాన్ని కట్టించిన కొండవీటి రామకృష్ణ
పి -ఫోర్ పథకం ఆదర్శంగా తీసుకుని నివాస గృహం ఏర్పాటు
కోడూరు:
కోడూరు పంచాయతీ పరిధిలోని స్థానిక ఐదవ వార్డ్ లో నివాసముంటున్న నిరుపేదైనటువంటి ఆకురాతి సాంబయ్యకు చెందిన ఇల్లు కొన్ని నెలల కిందట అగ్ని ప్రమాదం జరగడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమై సర్వసం కోల్పోయారు. సాంబయ్య ను ఆర్టిఏ యాక్ట్ కృష్ణా జిల్లా కన్వీనర్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కొండవీటి రామకృష్ణ పరామర్శించి ప్రమాదం జరిగిన వెంటనే నిత్యాసర వస్తువులు, బియ్యాన్ని అందించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.తర్వాత నివాస గృహాన్ని కూడా కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు 16 వేల రూపాయలతో సాంబయ్యకు రేకుల షెడ్డుతో కూడిన నివాస గృహాన్ని ఏర్పాటు చేశారు.
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన’ పి- ఫోర్’ ఆదర్శంగా తీసుకొని ఇంటి నిర్మాణం చేపట్టినట్లు రామకృష్ణ తెలిపారు.అతనికి అన్ని విధాలగా కూడా అండగా ఉంటానని అన్నారు.
