1వ తేదీన కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్,పార్లమెంట్సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు

భారత్ న్యూస్ గుంటూరు….
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే 2026-27 ఆర్ధిక సంవత్సర కేంద్ర బడ్జెట్ ముహూర్తం ఖరారైంది, జన వరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి….

Ammiraju Udaya Shankar.sharma News Editor…అయితే ఎప్పటిలాగే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్,పార్లమెంట్ ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2017 నుంచి ప్రతీ ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి ఫిబ్రవరి 1న ఆది వారం వచ్చినా సాంప్రదా యాన్ని కొనసాగించేలా ఆదివారం కూడా సభను నిర్వహించబోతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వరుసగా 9 వ సారి దేశ ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డుసృష్టించ బోతున్నారు..

ఈసారి బడ్జెట్ అంచనాలు గతంతో పోలిస్తే భారీగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మూలధన వ్యయం సుమారు రూ”11 నుండి 12 లక్షల కోట్ల వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రైల్వే లు,జాతీయ రహదారులు, పోర్టుల, అభివృద్ధికి సింహభాగం నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది.

ప్రతీసారి బడ్జెట్ సమావే శాలు రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమవుతాయి. ఆ సంప్రదాయం ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతోంది. ఈ సారి కూడా అదే పాటించ నున్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు, జరిగిన అభివృద్ది, రాబోయే రోజుల్లో ప్రవేశపెట్టబోయే పథకాల గురించి వివరిస్తారు.

ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం మొదలు పెడతారు.ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వ హించే దిశగా రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఛాన్స్ ఉంది దీంతో పాటు వ్యవసాయ రంగంలో నాణ్యమైన విత్తనాల లభ్యత కోసం పాత చట్టాల స్థానంలో కొత్త విత్తన బిల్లు ను తీసుకురానున్నారు. మహిళల కోసం కొత్త పథకా లు ప్రకటించే అవకాశం.30 రోజులకుపైగా జైలు జీవితం గడిపితే సీఎంలు, మత్రుల ను తొలగించే బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారని సమాచారం.

అంతర్జాతీయ పరిణామా లు, ద్రవ్యోల్బణం పెరుగు తున్న క్రమంలో ఈ సారి బడ్జెట్‌లో పలు కొత్త పథకాలు ఉండే అవకాశ ముందని తెలుస్తోంది. అలా గే పారిశ్రామిక వర్గాలకు ప్రయోజనం చేకూర్చే పలు నూతన సంస్కరణలు ఉంటాయని ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు. బడ్జెట్ అనగానే ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపులు, శ్లాబుల మార్పు గురించి ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమల్లోకి రాబోతుంది. దీంతో ఆదాయపు పన్ను పరంగా ఎలాంటి మార్పులు జరుగు తాయనేది ఆసక్తికరంగా మారింది.