భారత్ న్యూస్ విశాఖపట్నం..బియ్యం కాదు.. భోజనమే తీసుకొస్తాం!
గత ప్రభుత్వంలో రేషన్ సరకుల పంపిణీ కోసం వినియోగించిన ఎండీయూ వాహనాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ విధానంలో సరకుల పక్కదారి పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది
ఆకట్టుకుంటున్న మధ్యాహ్న బడి భోజనం
వాహనాలు
ఏపీలో ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’ కింద పాఠశాల విద్యార్థులకు భోజనం అందించేందుకు కడప జిల్లాలోని జమ్మలమడుగు మండలంలో రెండు స్మార్ట్ కిచెన్లను ప్రారంభించారు. అక్కడి నుంచి సుమారు 50 పాఠశాలలకు ఆహారాన్ని పంపించాల్సి ఉంటుంది. ఇందుకు 5 MDUవాహనాలను కొత్తగా ముస్తాబు చేసి ఉపయోగిస్తున్నారు. విద్యార్థులకు ఏ రోజు ఏయే రకాల భోజనం వడ్డిస్తారనే మెనూతో పాటు డొక్కా సీతమ్మ చిత్రాన్నీ వీటిపై ముద్రించారు.
