బీజేపీ ఎన్నికల ఖర్చు రూ.3,335 కోట్లు !*

భారత్ న్యూస్ విశాఖపట్నం..బీజేపీ ఎన్నికల ఖర్చు రూ.3,335 కోట్లు !*

లోక్‌సభ ఎన్నికలు, ఇతర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2024-25 సంవత్సరంలో ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ రూ.3,335.36 కోట్లు ఖర్చు చేసినట్లు ఆ పార్టీ వార్షిక ఆడిట్‌ నివేదిక వెల్లడించింది.

ఈ నివేదికను బీజేపీ ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది. 2019-20 సంవత్సరంలో 17వ లోక్‌సభ, ఏడు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల కోసం రూ.1,352.92 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ అంతకు రెండున్నర రెట్లు అధికంగా 2024-25 (18వ లోక్‌సభ) ఎన్నికల కోసం ఖర్చు చేసింది.