భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో రాజ్ భవన్ నిర్మాణానికి రూ.212 కోట్లు
విడుదల
అమరావతి :
ఏపీ రాజధాని అమరావతిలో కీలక నిర్మాణాలకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. నిన్న సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించగా.. నేడు రాజ్ భవన్ నిర్మాణానికి రూ.212.22 కోట్ల నిధులు కేటాయించింది. దీనిలో గవర్నర్ నివాసంతో పాటు సీనియర్ అధికారుల క్వార్టర్లు, ఇతర సహాయక సిబ్బందికి ప్లాట్ల నిర్మాణాలను కూడా చేపట్టబోతున్నట్లు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ జీవో జారీ చేశారు.
