భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ప్రారంభం, లబ్ధిదారుల ఖాతాల్లో రూ.436 కోట్లు జమ
ఆటో, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.15,000 ఆర్థికసాయం అందించే ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలో ప్రారంభించారు.
ఇందులో భాగంగా 2025-26 సంవత్సరానికి 2,90,669 మంది డ్రైవర్లకు రూ.436 కోట్ల మేర ఖాతాల్లో జమ చేశారు.
వీరిలో ఆటో డ్రైవర్లు 2,64,197 మంది, ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది ఉన్నారు
