భారత్ న్యూస్ రాజమండ్రి…ఆంధ్రజ్యోతిపై దాడి అప్రజాస్వామికం: దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి ఆగ్రహం
అవనిగడ్డ: హైదరాబాద్‌లోని ABN ఆంధ్రజ్యోతి కార్యాలయంపై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దాడిని దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. మంగళవారం అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాపై దాడి చేయడం అంటే, ప్రజల గొంతును నొక్కడమేనని ,వాస్తవాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగడం వైకాపా సంస్కృతికి పరాకాష్ట అని ‘వీకెండ్ కామెంట్ బై RK’ ప్రోగ్రాంలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, రౌడీల్లా కార్యాలయాల మీదకు వెళ్లడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మండలి రామమోహనరావు,కొల్లూరి బసవేశ్వర రావు,మేడికొండ విజయ్,కొల్లూరి వాసు,నాగిడి రాంబాబు,పాటిబండ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు
