అసెంబ్లీ సమావేశాలకు ముందే, ఏపీ లో రాజకీయ సెగలు !

భారత్ న్యూస్ రాజమండ్రి…
Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో అసెంబ్లీ సమావేశాలు మొదలు కాకముందే సమావేశాలకు ఇంకో రెండ్రోజుల సమయం ఉంది. అంత కంటే ముందే అధికార, విపక్షాల మధ్య నెక్స్ట్‌ లెవల్ లో మాటల యుద్ధం నడుస్తుంది. మధ్యలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కామెంట్స్‌ ఇంకా పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్నా యి.

దీంతో అసెంబ్లీలో కనిపిం చాల్సిన సభా సమరం కాస్త..డైలాగ్‌ వార్‌తో ట్రైలర్‌ను తలపిస్తోంది. సభ కంటే ముందే ఏపీ రాజకీయం తెగ ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. దమ్ముంటే అసెంబ్లీకి రావా లని ఇప్పటికే చంద్రబాబు సవాల్ చేశారు. నో వర్క్.. నో పే అంటూ స్పీకర్ బాంబ్ పేల్చారు. జగన్‌ కోసం రూల్స్ మార్చలేమని డిప్యూటీ స్పీకర్ అంటున్నారు.

ఏపీలో కూటమి పవర్‌లోకి వచ్చి 15 నెలలు అయి పోయింది. ఇప్పటివరకు మూడు, నాలుగు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. పవర్‌ కోల్పోయి న మొదట్లో అసెంబ్లీకి వచ్చి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు..తిరిగి అసెంబ్లీ వైపు చూడటం లేదు. ప్రతీసారి అసెంబ్లీ సెషన్ అప్పుడు కూటమి నేతలు సవాల్‌ విసరడం..దానికి వైసీపీ ఓ మెలిక పెట్టడం కామన్‌ అయిపోయింది.

ఇప్పుడు కూడా అదే డిమాండ్‌ను తెరమీదకు తెచ్చింది వైసీపీ.అయితే ఏపీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కామెంట్స్‌ కూడా వైసీపీకి ఇబ్బందికరం గా మారాయి. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సీఎం చంద్రబాబు సవాల్ విసిరి పొలిటికల్‌ హీట్‌ను పెంచితే..స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ రూల్స్‌, లాజిక్స్‌తో వైసీపీని ఇరకాటంలో పెట్టే స్కెచ్ వేస్తున్నారు.

ప్రజా తీర్పుని గౌరవించ కపోతే ఎలా..?
ప్రజలు మీకు ఓటేసిందే వారి సమస్యలను ప్రస్తావించాలని. అసెంబ్లీకి వస్తేనే ప్రజా సమస్యలపై చర్చించొచ్చు అంటున్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. ప్రజా తీర్పుని గౌరవించ కపోతే ఎలా..సభకు రాకుండా ఉంటే ఎలా కుదురుతుందంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.

అసెంబ్లీ జరిగేదే ఏడాదికి కేవలం 45 రోజులు..ఆ సమయంలో కూడా సభకు అటెండ్ కాకపోతే ఎలా అని క్వశ్చన్ చేస్తున్నారు.సభకు హాజరు కాని ఎమ్మెల్యేలు జీతాలు ఎలా తీసుకుంటా రని నిలదీస్తున్న స్పీకర్..నో వర్క్ నో పే రూల్‌ను ప్రస్తావించడం హాట్ టాపిక్ అవుతోంది.

ఒక చిన్న ఉద్యోగి విధులకు హాజరు కాకపోతే నో వర్క్ నో పేని అమలు చేస్తున్న ప్పుడు..అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం కరెక్టేనా అని లాజిక్ పాయింట్‌ను రేజ్‌ చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు.

జగన్‌కు ప్రతిపక్ష హోదాపై ఆసక్తికర వ్యాఖ్యలు..
స్పీకర్‌కు చెప్పకుండా అసెంబ్లీ వర్కింగ్ డేస్ 60 రోజుల్లో ఒక్కసారి సభకు గైర్హాజరుఅయినా..ఆటోమెటిక్‌గా సభ్యత్వం రద్దవు తుందని నిబంధనల్లో ఉందని కూటమి నేతలు చెబుతున్న మాట. గత సెషన్‌కు ముందే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు సంచలన కామెంట్స్ చేసి చర్చకు దారి తీశారు.

జగన్‌ సభకు రాకపోతే పులివెందులకే ఉప ఎన్నిక వస్తుందని కూడా హెచ్చరించారు. అయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామంటున్న వైసీపీ అధినేతను ఉద్దేశించి డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు లేటెస్ట్‌గా ఇంట్రె స్టింగ్‌ కామెంట్స్ చేశారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవడం లేదని.. ఆయన కోసం కొత్తగా విధివిధానాలు రూపొందిం చలేమన్నారు.