భారత్ న్యూస్ శ్రీకాకుళం…..గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు నియామకం పై హర్షం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ..
విజయనగరాన్ని అభివృద్ధి చేసిన నాయకులు, ప్రజాసేవ పట్ల అపారమైన నిబద్ధతను చూపించిన శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారు గోవా గవర్నర్గా నియమింపబడిన సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం నేతలు మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతలలో ఒకరైన అశోక్ గజపతి రాజు గారు విజయనగరం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి అనేక మార్లు ఎన్నికయ్యారని ముఖ్యంగా, ఆయన రాష్ట్రానికి చేసిన సేవల వల్ల ప్రజల మద్దతు గెలుచుకున్నారని, ప్రజాసేవలో 45 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ,కమర్షియల్ టాక్స్, ఎక్సైజ్, ఫైనాన్స్, రెవెన్యూ శాఖల మంత్రిగా, కేంద్ర మంత్రిగా సేవలు అందించిన రంగాలలో పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చారని నేతలు కొనియాడారు.గవర్నర్ గా వారి పాలనా కాలం గోవా ప్రజలకు సంక్షేమాన్ని, సమర్థతను, సమతుల్యాన్ని అందించాలని నేతలు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, కర్రా సుధాకర్, బండే రాఘవ, పర్చూరి దుర్గాప్రసాద్, దాసినేని శ్రీనివాసరావు, దాసినేని సాంబయ్య, బచ్చు రమణ,కంచర్ల ఆనంద్,రేపల్లె నాగబాబు, బచ్చు హనుమాన్, కటికల బాలాజీ,మెరుగు సోమిరెడ్డి,నాగిడి రాంబాబు,నాగిడి వెంకటేశ్వరరావు,దాసి రమేష్,గాలం శ్రీను,మేడికొండ విజయ్, కమ్మిలి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు
