వాట్సాప్‌‌కు పోటీగా భారత్ లో అరట్టై (Arattai) యాప్.

భారత్ న్యూస్ విశాఖపట్నం..వాట్సాప్‌‌కు పోటీగా భారత్ లో అరట్టై (Arattai) యాప్.

అరట్టై అంటే తమిళంలో చాటింగ్ అని అర్థం .ఈ మెసేజింగ్ యాప్ జోహో (ZOHO) కంపెనీ అభివృద్ధి చేసింది.

గత వారం రోజుల్లో తమ యాప్‌కు సంబంధించి 70 లక్షల డౌన్‌లోడ్లు జరిగాయని సంస్థ తెలిపింది.ఈ యాప్ 2021లో ప్రారంభమైంది.

ప్రైవసీ సంగతి ఏంటి ??

అరట్టైలో డేటా ప్రైవసీపైనా కొంతమంది సందేహాలు లేవనెత్తుతున్నారు. ఈ యాప్‌లో వీడియో కాల్స్‌కు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నప్పటికీ మెసేజ్‌లకు ఈ ఫీచర్ లేదు.ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ లేకపోతే మన మెసేజ్లకు భద్రత ఉండదు.

రెండు నెలల్లో మెసేజ్ లకు కూడా END TO END ENCRYPTION తీసుకువస్తాం అని సంస్థ తెలిపింది.

‘‘యూజర్ల వ్యక్తిగత గోప్యత, వారి వివరాలను ప్రభుత్వంతో షేర్ చేసుకునే విషయంలో జోహో పాలసీ గురించి స్పష్టత రానంత వరకు అరట్టైను ఉపయోగించడాన్ని ఎక్కువ మంది సేఫ్‌గా భావించలేరు” అని టెక్ చట్టాల నిపుణుడు రాహుల్ మత్తన్ చెప్పారు.