భారత్ న్యూస్ రాజమండ్రి ….వాల్మీకి బోయల ఎస్టీ విషయంలో ఎన్డీఏ మద్దతు కోరిన ఏపీవీబీఎస్
ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయలను ST జాబితాలో చేర్చడానికి సహకరించండి
రాజ్యాంగ ఉల్లంఘన జరిగిన అంశంలో పార్లమెంట్ సాక్షిగా న్యాయం చేయాలి అని కోరిన ఏపీవీబీఎస్
వాల్మీకి బోయల పైన రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, కేంద్ర గిరిజన శాఖ కమిషన్ శాఖల యొక్క సహకారం అందించాలని డిమాండ్
మోసపోయిన వాల్మీకి జాతికి ఇకనైన న్యాయం చేయండి అని వినతి
ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
ఎన్డీఏ ప్రభుత్వం వాల్మీకి బోయలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
- అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం (ఏపీవీబీఎస్).
ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయలకు న్యాయం చేయాలని ఎన్డీఏ ప్రభుత్వ కేంద్ర మంత్రులను, ముఖ్య నాయకులను ఢిల్లీ లో మర్యాదపూర్వకంగా కలిసి వివరించిన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం (ఏపీవీబీఎస్) రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ.
ఆంధ్రా రాష్ట్రంలో అత్యంత మోసపోయిన జాతి వాల్మీకి బోయ జాతి అని 2017లో అప్పటి టిడిపి ప్రభుత్వ సమయంలో గవర్నర్ ప్రసంగం మరియు మద్దతుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్యపాల్ కమిటీ రిపోర్ట్ మరియు కారెం శివాజీ గారి “ఎపి ఎస్సీ, ఎస్టీ కమిషన్” నివేదికల ఆధారంగా తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం 2023 లో వన్ మ్యాన్ కమీషన్, ఎస్టీ కమీషన్ రిపోర్ట్స్ తో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపింది, ఆ తరువాత కేంద్రం కొన్ని కామెంట్స్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు సార్లు వెనక్కు పంపడంతో సమస్య అలానే ఉంది అని అన్నారు.

రాష్ట్ర అధ్యక్షులు క్రాంతి నాయుడు మంత్రులకు వివరిస్తూ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లోని వాల్మీకి బోయలు షెడ్యూల్డ్ తెగగా గుర్తించడానికి కేంద్రం నిర్ణయించిన, కావాల్సిన సామాజిక లక్షణాలను, లోకూరు కమిటీ ప్రమాణాలను, ప్రభుత్వం నిర్ణయించే ప్రమాణాలను పూర్తిగా సంతృప్తి పరుస్తారు అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిషన్లు చెబుతున్నాయి అని, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలిపినా కానీ కేంద్రంలో రిజిస్ట్రార్ట్ జనరల్ ఆఫ్ ఇండియా (ఓఆర్జిఐ), గిరజన శాఖ కమిషన్(ఎన్సీఎస్టి) వారు ఏదో ఒక క్వెర్రీ పెట్టి ఈ ప్రక్రియను ఆపుతున్నారు అని, తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి వివరణ పంపాలి అని ఇప్పటికీ 10 ఏళ్ల కాల యాపన చేశారు అని, రాజ్యాంగ ఉల్లంఘన జరిగి మోసపోయిన వాల్మీకి బోయలకు తప్పకుండా న్యాయం చేయాలని ప్రస్తుతం కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నందుకు చొరవ తీసుకుని పార్లమెంట్ సాక్షిగా ఆమోదించి ఎస్టీ జాబితాలో చేర్చాలి అని కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువాల్ ఓరామ్ ను, కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ ను, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతపురం పార్లిమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీ నారాయణ సహకారంతో టీడీపీ పార్లిమెంట్ సభ్యులు అందరిని మరియు తదితర పార్టీల నాయకులను పార్లిమెంట్ లో కలిసి సమస్య వివరించి, వినతి పత్రం అందజేయడం జరిగింది. రాజ్యాంగ ఉల్లంఘన, ప్రాథమిక హక్కులు కోల్పోయి మోసపోయిన వాల్మీకి బోయ జాతికి న్యాయం జరిగేలా చూడాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీవీబీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు వాల్మీకి అర్జున్, బాబు నాయుడు వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్, రాజు, రమేష్, అనంతపురం జిల్లా అధ్యక్షులు మాధవయ్య, ప్రధాన కార్యదర్శి తలారి ఆదినారాయణ, గౌరవ అధ్యక్షులు అంకె రామలింగమయ్య, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిలేటి, ఆలూరు యువజన విభాగం అధ్యక్షుడు వీరేష్ తదితరులు పాల్గొన్నారు.