భారత్ న్యూస్ రాజమండ్రి..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీ క్యాబినెట్లో ₹50,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
లే ఔట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి చట్ట సవరణలపై చర్చ
ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించేందుకు కొత్త పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పాలసీ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఉత్పాదనను పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా తీసుకు వచ్చారు.
మంత్రివర్గ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో 42 అంశాలపై చర్చ జరిగింది. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారధి మీడియాకు వివరించారు.
స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) ద్వారా సుమారు ₹50,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరియు ఉద్యోగ సృష్టికి దోహదపడతాయని మంత్రి తెలిపారు. అలాగే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (CRDA) సంబంధిత ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సాగు భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు సంబంధించిన నాలా చట్ట సవరణపై చర్చ జరిగింది. ఈ సవరణ భూమి ఉపయోగ నియమాలను సరళీకరించడం ద్వారా అభివృద్ధి ప్రాజెక్టులను సులభతరం చేస్తాయి.
లే ఔట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి చట్ట సవరణలపై చర్చ జరిగింది. వీఎంఆర్డీఏ పరిధిలో భూసమీకరణపై, నీటి సరఫరా, సీపేజీ నిర్వహణ ప్యాకేజీలపై, ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్ లేఔట్లకు కమిటీ సిఫార్సులపై , వార్డు వెల్ఫేర్, డెవలప్ మెంట్ కార్యదర్శి పోస్టుల అప్ గ్రేడ్ పై చర్చ జరిపి నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ జల వనరుల శాఖకు చెందిన పనులపై, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్, తిరుపతిలో తొక్కిసలాటపై ఇచ్చిన నివేదికపై, నూర్ బాషా దూదేకుల అభివృద్ధి కార్పొరేషన్ మార్పుపైనా మంత్రులు చర్చించారు.
సింగపూర్ పర్యటనపైనా చంద్రబాబు స్పందించారు. గతంలో రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివద్ధి కోసం సింగపూర్ కన్సార్టియం ఏపీకి వచ్చిందన్నారు. ప్రభుత్వం మారిన తరువాత వారిని వెళ్లగొట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో సింగపూర్ కన్సార్టియం వారిపై అవినీతి ముద్ర వేసి కేసులు పెట్టేందుకు యత్నించారన్నారు. సింగ్ పూర్ వారితో ఉన్న మంచి సంబందాలను చెడగొట్టారని.. మళ్లీ వారితో సంబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

తిరుపతి తొక్కిసలాటపై నివేదిక మేరకు బాధ్యులపై చర్యలుతతీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. విచారణ కమిటీ అప్పటి గో సంరక్షణ శాల ఉన్నతాధికారిని బాధ్యుడిని చేసింది. ఆ అధికారిపైచర్యలు తీసుకోనున్నారు. తిరుపతి ఘటనపై అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యతగా వ్యవహరించలేదన్నారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో కలిసి చంద్రబాబు భోజనం చేశారు.