భారత్ న్యూస్ విజయవాడ…కనపర్తి శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా కలసిన నూతనంగా నియమితులైన డైరెక్టర్లు
అవనిగడ్డ: ఇటీవల రాష్ట్ర స్థాయిలో వివిధ కార్పొరేషన్లలో పదవులు పొందిన రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ పైడిపాముల కృష్ణకుమారి, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పైడిపాముల స్వప్న, రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కార్పొరేషన్ డైరెక్టర్ బోలెం నాగమణిలు మంగళవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మరియు అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు శ్రీ కనపర్తి శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
అవనిగడ్డలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన డైరెక్టర్లు తమకు పదవులు దక్కడంలో సహకరించినందుకు శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, శాలువాలతో సత్కరించి, ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, పార్టీలో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. నూతనంగా పదవులు పొందిన ఈ ముగ్గురు మహిళలు తమ తమ రంగాలలో పార్టీకి, ప్రజలకు మరింత సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీనివాసరావు గారు నూతన డైరెక్టర్లను శాలువాలతో సత్కరించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, ఘంటశాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ,చల్లపల్లి ఎంపీపీ కోట విజయ రాధిక,తెలుగుదేశం పార్టీ నాయకులు కర్రా సుధాకర్, పరుచూరి దుర్గా ప్రసాద్,విశ్వనాథపల్లి పాప, బండే కనకదుర్గ, బచ్చు హనుమాన్, పరిసే మౌళి, మల్లంపాటి లీలా,కొల్లూరి ఇమ్మనియేలు,కమ్మిలి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
