భారత్ న్యూస్ శ్రీకాకుళం….. .ఏపీలో రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారా..
రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోండిలా..
అమరావతి :

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నాక ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ ఇలా మూడు చోట్ల పరిశీలించాల్సి ఉంటుంది. ఆ దశల పూర్తికి 21 రోజుల సమయం పడుతుంది. ఈక్రమంలో దరఖాస్తుల పురోగతిని ఆన్లైన్లో చూసుకోవచ్చు. https://vswsonline.ap.gov.in/ వెబ్సైటులో స్టేటస్ చెక్ ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు.