భారత్ న్యూస్ గుంటూరు…మహిళలకు ఏపీ ఆర్టీసీ శివరాత్రి కానుక..స్పెషల్ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ!

Ammiraju Udaya Shankar.sharma News Editor…మహాశివరాత్రికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
స్పెషల్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం
కోటప్పకొండకు 618, శ్రీశైలానికి పలు డిపోల నుంచి బస్సులు
భక్తుల సౌకర్యార్థం రెండు వేల మంది సిబ్బందితో ఏర్పాట్లు
ప్రత్యేక సర్వీసుల ఛార్జీల వివరాలు ప్రకటించిన అధికారులు

పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లకు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం మొత్తం 618 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి అదనంగా 70 బస్సులను నడుపుతున్నామని పేర్కొన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దాదాపు రెండు వేల మంది సిబ్బందిని విధుల్లో నియమించారు. నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, అద్దంకి, చీరాల డిపోల నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ప్రయాణికుల సౌకర్యార్థం పెట్లూరివారిపాలెం వద్ద ప్రత్యేకంగా ఆర్టీసీ క్యాంపు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు.